Ads 468x60px

Total Pageviews

Friday, February 14, 2014

ఓం సాయి -- శ్రీ సాయి -- జయ జయ సాయి.సాయిబాబా అవతార మూర్తి. ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించినవారు ధన్యులు. బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం పొందినవారు, ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందివారు అదృష్టవంతులు. మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్ తదితరులు ఎందరో బాబాతో సన్నిహితంగా గడిపారు. వారిద్వారా సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.

సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ''ఇప్పుడు వద్దు'' అని చెప్పినా పట్టించుకోకుండా, ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావలసి వచ్చేది. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి, కష్టనష్టాలు కొనితెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు. బాబా మాటలమీద గురి ఉన్నవారు మాత్రం, ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు.

సాయిబాబా షిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తే షిర్డీకి ఉత్తరాన ఉన్న నీంగావ్, దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికీ వెళ్ళింది లేదు. బాబా ఎన్నడూ రైలు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కానీ, రైళ్ళ రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, దారిలో ఎవరు ఎదురౌతారో కూడా చెప్పేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా జరిగేది.

సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగబోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. కొన్నిసార్లు పెద్దపెద్దగా కేకలు వేసేవారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపుమీద చరుచుకునేవారు. మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి ''పిచ్చి పకీరు'' అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంతమాత్రం అర్ధమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు. బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కూర్చుని మహినంతటినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా.

సాయిబాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్ధమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్ధం చేసుకుని తూచ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.

ఇక్కడ నా వక్తిగత ఆనుభవాలలో కొన్నిటిని మీతో పంచుకోదలచాను. సాదారణంగా ఆవధూత పరంపరలోని మహాత్ములందరి చేష్టలు, ప్రవర్తనలు కూడా యించు మించుగా ఒకే విధంగానే వుండవచ్చు. ఎందుకంటే బాబా కాలంలోని శ్యామ మహల్సాపతి లాంటి సన్నిహిత భక్తులు, బాబా నుంచి ఏ విదమైనటువంటి ఆనుభవాలను పొందారో, ఆదే విదంగా నేటి తరం మహాత్ములైన... శ్రీ భగవాన్ గొలగమూడి వెంకయ్య స్వామి, శ్రీ కాశి రెడ్డి నాయన, శ్రీ రామిరెడ్డి తాత లాంటి మహాత్ములు కూడా తమ తమ భక్తులకు ఆటువంటి ఆనుభవాలనే ప్రసాదించారు.

ఉదాహరణకు నేటి కాలంలో యింకా మన కళ్ళ ముందు సజీవంగా నిలచి వున్న, శ్రీ స్వామి జగద్విఖ్యాత గారి జీవిత చరిత్రే దీనికి నిలువెత్తు నిదర్శనం. చూసేందుకు నేటి తరం యువకుడిలా చిన్నపిల్లవాడిగా ఆగుపించినప్పుటికీ, శ్రీ స్వామి జగద్విఖ్యాత గారి మాటలను చేష్టలను దగ్గరగా గమనించిన వారికీ మాత్రం ఆసలు ఆవధూతలు ఆనేవాళ్ళు ఏంత విబిన్నమైన స్తాయిలో వుంటారో, ఆసలు వారి మనస్టితి ( ప్రవర్తన ) ఏ విదంగా వుంటుందో ఆనేటువంటి.... పలు అంశాలపై స్వస్తమైన ఆవగాహన కలుగుతుంది. సాయి మార్గంలో తన 13 వ యేట నుంచే తన జీవిత ప్రస్తానాన్ని మొదలు పెట్టి, సాయి ఆనుగ్రహంతో ఎంతో మంది యోగులను ఆవధూతలను దర్శించి నేటికి నిత్య సత్యులుగా సామాన్య భక్తులుగా శ్రీ సాయి మార్గంలో తమ జీవిత ప్రస్తానాన్ని సాగిస్తున్న శ్రీ స్వామి జగద్విఖ్యాత గారు, ఎంతో మంది యెగులను ఆవధూతలను సజీవంగా దర్శించి ( గుర్తించి ) ఆ మహాత్ముల యొక్క ఆనుగ్రహలను ఆనిర్వచనియమైన ఆనుభవాలను, ప్రతి ఒక్కరికి అందించటంలో కృతకృతులు చరితార్డులు కాగలిగారు.

0 comments:

Post a Comment


Keep watching PANDU TRUST.

Feel free to share your ideas via Phones / Sms to +91 9492379648.

Make a Donation - if you like to help ANIMALS, HUMANS or NATURE.

You can donate : Cloths, Bedsheets, Sweters, Educational Books (Knowledge), Stationary & General Medicines, Snacks, Fresh food packets.

Thanks for your Comment.